ఇది చూస్తే కడుపుబ్బ నవ్వేస్తారు | Thief Breaks In Through Garage Window..but too upset | Sakshi
Sakshi News home page

ఇది చూస్తే కడుపుబ్బ నవ్వేస్తారు

Jun 26 2017 5:26 PM | Updated on Sep 5 2017 2:31 PM

ఇది చూస్తే కడుపుబ్బ నవ్వేస్తారు

ఇది చూస్తే కడుపుబ్బ నవ్వేస్తారు

సాధారణంగా దొంగతనం వీడియో అంటే కాస్తంత ఉత్కంఠను కలిగిస్తుంది. అతడు దొంగతనానికి ఎలా పాల్పడ్డాడు? ఎలా సురక్షితంగా బయటపడ్డాడు? ఎవరైనా పట్టుకున్నారా అనే దృశ్యాలు కనిపిస్తున్నాయా అని ఆత్రుతగా చూస్తుంటారు.

సాధారణంగా దొంగతనం వీడియో అంటే కాస్తంత ఉత్కంఠను కలిగిస్తుంది. అతడు దొంగతనానికి ఎలా పాల్పడ్డాడు? ఎలా సురక్షితంగా బయటపడ్డాడు? ఎవరైనా పట్టుకున్నారా అనే దృశ్యాలు కనిపిస్తున్నాయా అని ఆత్రుతగా చూస్తుంటారు. కానీ, సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఓ దొంగతనం వీడియో మాత్రం ఇప్పుడు కడుపుబ్బ నవ్విస్తోంది. ఓ గ్యారేజ్‌లో భారీ స్థాయిలో దొంగతనం చేయాలని వచ్చిన ఓ దొంగ తొలుత నేరుగా తలుపు వద్దకు వెళ్లి దానిని తెరిచే ప్రయత్నం చేశాడు. అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో తిరిగి కిటికీ వద్దకు వెళ్లాడు. దానిని తన శాయశక్తుల్ని ఉపయోగించి తెరిచేందుకు ప్రయత్నించాడు.

పదేపదే ట్రై చేయడంతో చివరకు కిటికీ తెరుచుకుంది. దీంతో ఆశగా అతుడు లోపలికి అడుగుపెట్టాడు. అలా వెళ్లాడో లేదో బిత్తరపోవడం అతడివంతైంది. ఎందుకంటే అతడు ఎంతో కష్టపడి లోపలికి వెళ్లిన ఆ గ్యారేజీకి ముందు భాగంలో అసలు తలుపే లేదు. అంతా విషాలంగా ఓ వరండా మాదిరిగా ఉంది. అంటే దాదాపు తెరిచిపెట్టినట్లు. గ్యారేజీకి వెనుక భాగంలో మాత్రం షో కోసమే అన్నట్లుగా తలుపు, కిటికీలు బిగించి ముందుభాగమంతా ఓపెన్‌గా ఉంచే ఆ గ్యారేజ్‌ నడుపుతున్నారు. పాపం ఆ విషయం తెలియని దొంగ శ్రమకూర్చి లోపలికి వెళ్లి అంతా తెరిచి ఉండటంతో తీవ్ర విచారంతో అడుగులేస్తూ బయటకొచ్చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌కాగా చూసిన వారంతా కూడా కడుపు చెక్కలయ్యేలాగా నవ్వుతున్నారు.

Advertisement

పోల్

Advertisement