
పెట్రోల్‌పై 70 పైసలు తగ్గింపు
పెట్రోల్ ధర స్వల్పంగా లీటరుకు 70 పైసలు తగ్గింది. తగ్గింపు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర స్వల్పంగా లీటరుకు 70 పైసలు తగ్గింది. తగ్గింపు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. స్థానిక పన్నులు కూడా తగ్గనుండడంతో ధరలు ప్రాం తాలను బట్టి మరికొంత దిగివస్తాయి. పెట్రోల్ ధర తగ్గడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 1న 75 పైసలు తగ్గించారు. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు ధర 85 పైసలు తగ్గి రూ.71.41కు చేరుకుంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతుండడంతో ధర తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రతినెలా డీజిల్ ధరను సవరిస్తున్న చమురు కంపెనీలు ఈసారి దాని పెంపు జోలికి పోకపోవడంతో దాని ధరల్లో మార్పులు ఉండవు.