నిబంధనలతో ప్రభుత్వం ఏర్పడదు: బీజేపీ | The government formed with the provisions of: BJP | Sakshi
Sakshi News home page

నిబంధనలతో ప్రభుత్వం ఏర్పడదు: బీజేపీ

Mar 19 2016 1:27 AM | Updated on Mar 29 2019 9:31 PM

నిబంధనలతో ప్రభుత్వం ఏర్పడదు: బీజేపీ - Sakshi

నిబంధనలతో ప్రభుత్వం ఏర్పడదు: బీజేపీ

జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై మెహబూబా ముఫ్తీ రోజుకో డిమాండ్‌ను తెరపైకి తెస్తుండటంతో సంకీర్ణంపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై మెహబూబా ముఫ్తీ రోజుకో డిమాండ్‌ను తెరపైకి తెస్తుండటంతో సంకీర్ణంపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నిబంధలనపై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేమని పేర్కొంది. గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో పీడీపీ చీఫ్ మెహబూబా  భేటీ, తెరవెనక మంత్రాంగం జరిగినా, సానుకూల ఫలితాలేమీ కనిపించలేదని పీడీపీ పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా..  పీడీపీ పెడుతున్న నిబంధనలే ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయన్నారు.  

 నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ  భేటీ: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం ఢిల్లీలో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement