ఇద్దరు అల్ కాయిదా ఉగ్రవాదుల అరెస్ట్ | The arrest of two terrorists of al qaeda | Sakshi
Sakshi News home page

ఇద్దరు అల్ కాయిదా ఉగ్రవాదుల అరెస్ట్

Dec 17 2015 2:04 AM | Updated on Aug 21 2018 5:52 PM

ఇద్దరు అల్ కాయిదా ఉగ్రవాదుల అరెస్ట్ - Sakshi

ఇద్దరు అల్ కాయిదా ఉగ్రవాదుల అరెస్ట్

అల్ కాయిదాకు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూఢిల్లీ/భువనేశ్వర్: అల్ కాయిదాకు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో అరెస్టయిన మహమ్మద్ ఆసిఫ్ (41) భారత్‌లో అల్ కాయిదా (ఏక్యూఐఎస్) వ్యవస్థాపక సభ్యుడిగా భావిస్తున్నారు. అల్ కాయిదాలో చేరేందుకు యువతను ప్రేరేపించడం, రిక్రూట్‌మెంట్, శిక్షణ వంటి కార్యకలాపాలను ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ నుంచి ఆసిఫ్ నిర్వహిస్తున్నాడు. ఒడిశా కటక్‌లోని జగత్‌పూర్‌లో అబ్దుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేశారు.

ఆసిఫ్ నుంచి మూడు సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, జిహాదీ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. రెహమాన్‌కు ఒక భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కటక్ దగ్గర్లోని టాంగీ ప్రాంతంలో ఓ మదరసాను నడుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement