ఉగ్రవాదుల చేతిలో జవాన్‌ దుర్మరణం | Terrorist Killed Jawan in Bandipora | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల చేతిలో జవాన్‌ దుర్మరణం

Sep 28 2017 1:34 AM | Updated on Sep 28 2017 1:35 AM

Terrorist Killed Jawan in Bandipora

శ్రీనగర్ ‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలోని హజ్జాన్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ రమీజ్‌ అహ్మద్‌ పర్రే ఇంట్లోకి బుధవారం చొరబడ్డ ఉగ్రవాదులు.. అయన్ను సమీపం నుంచి కాల్చిచంపారు. ఈ దాడిలో రమీజ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన కుటుంబ సభ్యులు నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. రమీజ్‌ అహ్మద్‌ పర్రే ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచాక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. రమీజ్‌ కొద్ది రోజుల క్రితమే సెలవులపై ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 10వ తేదీన ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఆర్మీ లెఫ్టినెంట్‌ మేజర్‌ ఉమర్‌ ఫయాజ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement