జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం! | terrorist killed in Encounter Haritar Tarzoo area in Baramullah | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం!

Jan 3 2017 7:27 AM | Updated on Sep 5 2017 12:19 AM

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం!

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కలకలం!

జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల సంచారం స్థానికంగా కలకలం రేపింది.

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల సంచారం స్థానికంగా కలకలం రేపింది. జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులు హరితర్ తర్జు ప్రాంతంలో సంచరింస్తున్నారని సమాచారం అందుకున్న జవాన్లు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాల్పులకు పాల్పడ్డ ఓ ఉగ్రవాదని జవాన్లు హతమార్చినట్లు సమాచారం. ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

మరో ఉగ్రవాది అదే ప్రాంతంలో నక్కినట్లు జవాన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండో ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఆర్మీ కూంబింగ్ జరుపుతోంది. దాడులకు పాల్పడే ఉద్దేశంతోనే ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో బారాముల్లా జిల్లాలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement