కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా సహకారం అందిస్తామని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా సహకారం అందిస్తామని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు. హైకోర్టు విభజనపై పార్లమెంట్లో పోరాడుతామన్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం పార్టీ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో కలసి చర్చిస్తామని చెప్పారు.