ఓ యువ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అమ్మాయి మృతి చెందింది. అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో..
యువతి మృతి..యువకుడి పరిస్థితి విషమం..
Mar 17 2017 5:26 PM | Updated on Apr 8 2019 6:21 PM
జైపూర్: రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఓ యువ జంట శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో అమ్మాయి మృతి చెందగా, అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన జలోర్ జిల్లా జశ్వంత్‌పూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పాయిల్ గ్రామంలో చోటుచేసుకుంది.
అపస్మారక స్థితిలో ఉన్న యువ జంటను గమనించిన గ్రామస్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరతి(18) మరణించగా, శ్రావణ్‌భీల్ (18) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతిరాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఘటన స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోలీసులు తెలిపారు. కేసును అన్ని కోణాల్లో విచారించి త్వరలోనే కారణాలు వెల్లడిస్తామన్నారు.
Advertisement
Advertisement