ఫేస్బుక్లో అభ్యంతరకరమైన సందేశాన్ని పంపినందుకు ఓ యువకుడి ప్రాణాలు పోయాయి.
ఫేస్బుక్లో అభ్యంతరకరమైన సందేశాన్ని పంపినందుకు ఓ యువకుడి ప్రాణాలు పోయాయి. హిందూ రాష్ట్రసేనకు చెందిన కొంతమంది యువకులు అతడి మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పుణెలో జరిగిన ఈ సంఘటనలో ఇప్పటికి 13 మందిని అరెస్టు చేశారు. మొహిసిన్ మహ్మద్ సాదిక్ షేక్ అనే ఆ యువకుడిని అతడి ఇంటివద్దే హాకీ స్టిక్లతో కొట్టి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు.
అతడిని చంపిన తర్వాత.. 'మొదటి వికెట్ పడిపోయింది' అనే ఎస్ఎంఎస్ నిందితుల ఫోన్లలో చక్కర్లు తిరిగిందని పుణె జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపారు. 2006 నుంచి పుణెలో ఉంటున్న షేక్, గత నాలుగేళ్లుగా ఓ వస్త్ర సంస్థలోని ఐటీ విభాగంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో అతడు అభ్యంతరకరమైన పోస్టు మీద వదంతులు వ్యాపింపజేస్తున్నాడన్నదే అతడి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.