అతడు చాయ్ అమ్మితేనేం... | Tea seller spreading message of conservation of water | Sakshi
Sakshi News home page

అతడు చాయ్ అమ్మితేనేం...

Apr 12 2015 12:53 PM | Updated on Aug 11 2018 4:36 PM

అతడు చాయ్ అమ్మితేనేం... - Sakshi

అతడు చాయ్ అమ్మితేనేం...

లక్ష్యం లేనివాళ్ల విషయం పక్కన పెడితే.. లక్ష్యం ఉన్నవాళ్లు మాత్రం ఎక్కడ ఉన్నా మెరుస్తూనే ఉంటారు. వారి ఆలోచన మంచిదైతే ఏ విధంగానైనా జనాల్లోకి వెళుతుంది.

బరంపూర్: లక్ష్యం లేనివాళ్ల విషయం పక్కన పెడితే.. లక్ష్యం ఉన్నవాళ్లు మాత్రం ఎక్కడ ఉన్నా మెరుస్తూనే ఉంటారు. వారి ఆలోచన మంచిదైతే ఏ విధంగానైనా జనాల్లోకి వెళుతుంది. పశ్చిమ బెంగాల్కు చెందిన 35 ఏళ్ల వయసున్నరవి అనే వ్యక్తి టీలు అమ్ముకుని జీవిస్తున్నాడు. సమాజం పట్ల అతడికి కాస్తంత స్పృహ ఎక్కువ. పర్యావరణాన్నిఎలా రక్షించుకోవాలనే విషయంలో ఒక నెల రోజులపాటు మంచిమంచి సందేశాలను ఇవ్వడం, నీటి వనరుల వినియోగం విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలో చెప్పడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అది కూడా అంతా యువతకే.

ఇప్పటికే బెంగాల్లోని పలు నగరాల్లో పర్యటించిన రవి.. ప్రస్తుతం ఒడిశాలోని కాళీకోట్ అటనామస్ కాలేజీ విద్యార్థులకు తన హితోపదేశం చెప్పాడు. త్వరలోనే హైదరాబాద్కు రానున్నాడు.  సైకిల్ ద్వారా అతడు రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. తక్కువ నిడివి ఉన్న ప్రాంతాలకు సైకిల్ను ఉపయోగించడం ద్వారా ఇంధనాన్ని పొదుపు చేయొచ్చని కూడా రవి చెప్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement