కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై సందుదొరికిన ప్రతీసారీ తీవ్ర విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈసారి తన పంథా మార్చుకున్నారు.
మన్ కీ బాత్ తరహా ప్రోగ్రాం చేయనున్న సీఎం
Jul 5 2016 10:45 AM | Updated on Oct 9 2018 4:36 PM
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై సందుదొరికిన ప్రతీసారీ తీవ్ర విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈసారి తన పంథా మార్చుకున్నారు. ఈ సారి ప్రధాని మోదీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీ రేడియోలో ప్రసంగించే 'మన్ కీ బాత్' కార్యక్రమం అథ్యదిక ప్రజాధరణ పొందిన విషయం తెలిసిందే. ఇలాంటి కార్యక్రమం తరహాలోనే కేజ్రీ ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారు. 'టాక్ టు ఏకే' పేరుతో నెలకొక సారి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. www.talktoak.com లోకి లాగాన్ అయి తనతో ఆలోచనలు పంచుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జులై 17 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Advertisement
Advertisement