పాక్‌ రహస్య గూఢచారి అరెస్టు

Suspected Pakistan Spy Arrested - Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు చెందిన రహస్య గూఢాచారిగా భావిస్తున్న నిర్మల్‌ రాయ్‌ అనే వ్యక్తిని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వాస్తవాధీన రేఖ సమీపంలో గల అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో మిలిటరీ ఇంటిలెజిన్స్‌ అధికారులు అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌, ఇతరత్రా గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం... అసోం నివాసి అయిన నిర్మల్‌ రాయ్‌ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఐఎస్‌ఐ అధికారితో అతడు తరచుగా మాట్లాడినట్లుగా ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఆర్మీకి సంబంధించిన పలు రహస్య పత్రాలు, ఆర్మీ ఉపయోగించే బ్రిడ్జి వివరాలు, ఆర్మీ ప్రొఫైల్స్‌, ఆయుధ ప్రొఫైల్స్‌, కిబితు(అసోం)లోని భారత ఫిరంగిదళం గురించిన సున్నితమైన సమాచారాన్ని దుబాయ్‌లో నివసించే పాకిస్తాన్‌ సీక్రెట్‌ ఏజెంట్‌తో పాటుగా  ఓ ఇండోనేషియన్‌ మహిళకు కూడా చేరవేసినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top