సుష్మాజీ.. ఫ్రిజ్ రిపేర్ చేయించరూ..! | Susmaji had to repair the fridge! | Sakshi
Sakshi News home page

సుష్మాజీ.. ఫ్రిజ్ రిపేర్ చేయించరూ..!

Jun 15 2016 8:17 AM | Updated on Sep 4 2017 2:28 AM

సుష్మాజీ.. ఫ్రిజ్ రిపేర్ చేయించరూ..!

సుష్మాజీ.. ఫ్రిజ్ రిపేర్ చేయించరూ..!

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల్లో బిజీ. విదేశాల్లోని భారతీయులు ట్విటర్‌లో అభ్యర్థనలు చేసినా సత్వరమే పరిష్కారానికి ఆదేశాలిస్తారు.

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్  విదేశీ వ్యవహారాల్లో బిజీ. విదేశాల్లోని భారతీయులు ట్విటర్‌లో అభ్యర్థనలు చేసినా సత్వరమే పరిష్కారానికి ఆదేశాలిస్తారు. అందుకు మన్ననలూ అందుకుంటున్నారు.  అయితే ఆమె పరిష్కరించలేని సమస్యను ట్విటర్ ద్వారా విన్నవించాడో వ్యక్తి.

సామ్‌సంగ్ కంపెనీ తనకు లోపభూయిష్ట ఫ్రిజ్‌ను అంటగట్టిందని, దానిని మార్చి ఇవ్వడానికి కూడా కంపెనీ అంగీకరించడంలేదని పేర్కొంటూ తన సమస్యను పరిష్కరించాలని మంగళవారం కోరాడు. పనిలో పనిగా మరో మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు కూడా తన అభ్యర్థన పంపాడు. దీనికి సుష్మ సమాధానం ఇస్తూ.. ‘‘బ్రదర్.. రిఫ్రిజిరేటర్ విషయంలో నీకు సహాయం చేయలేను. అమితమైన బాధలు పడుతున్న వారి సమస్యల పరిష్కారంలో నేను బిజీగా ఉన్నాను’’ అంటూ స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement