‘పాక్‌లో భారత బాలికల కిడ్నాప్‌పై నివేదిక’

Sushma Swaraj Seeks Report On Alleged Kidnapping Of Hindu Girls In Pak - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో హోలీ సందర్భంగా ఇద్దరు భారత మైనర్‌ బాలికలను అపహరించి వారిని బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారనే ఆరోపణలపై భారత్‌ స్పందించింది. ఈ వ్యవహారంపై నివేదిక పంపాలని పాకిస్తాన్‌లో భారత రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ కోరారు. ఈ ఘటనకు సంబంధించిన మీడియా కథనాలను ట్యాగ్‌ చేస్తూ పాక్‌లో భారత హైకమిషనర్‌కు దీనిపై వివరాలు పంపాలని కోరుతూ ట్వీట్‌ చేశారు.

హోలీ వేడుకల నేపథ్యంలో సింధ్‌ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లా ధర్కి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మీడియా కధనాలు వెల్లడించాయి. ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన చేపట్టిన హిందువులు నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డివమాండ్‌ చేశారు. పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువుల దుస్థితిపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top