నెటిజన్‌ ప్రశ్న.. చిన్నమ్మ చమత్కారం

Sushma Swaraj Funny Reply on Bali Inquiry  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వటమే కాదు, అవసరమైన మేర సాయం చేస్తుంటారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌. అందుకే ఆమె ట్విటర్‌ ఖాతాకు ట్వీట్లు వెల్లువలా వచ్చి పడతాయి. ఈ క్రమంలో గత రాత్రి ఓ వ్యక్తి ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆమె ఫన్నీ బదులు ఇచ్చారు. 

‘బాలీకి వెళ్లటం సురక్షితమేనా. ఆగష్టు 11 నుంచి 17 మధ్య మేం అక్కడ పర్యటించాలనుకుంటున్నాం. ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? దయచేసి  మాకు సలహా ఇవ్వండి’ అని రాయ్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు. దీనికి చిన్నమ్మ సమాధానమిస్తూ... ‘అక్కడి అగ్నిపర్వతాన్ని సంప్రదించి  మీకు చెబుతాను’ అంటూ ఫన్నీ సమాధానం ఇచ్చారు. ఆమె టైమింగ్‌కు పలువురు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.

కాగా, ఇండోనేషియా బాలీ ద్వీపంలోని ‘అగుంగ్‌ అగ్నిపర్వతం’ గత కొన్నిరోజులుగా క్రియాశీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు మూసేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం అగ్నిపర్వతం నుంచి లావా, బూడిద వెలువడటం తగ్గినప్పటికీ.. స్వల్ప భూకంపాలు మాత్రం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి సుష్మాజీని ఆరా తీశాడన్న మాట.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top