ఖరగ్‌పూర్- విజయవాడ ఫ్రైట్ కారిడార్ | suresh prabhu announces three fright carridors | Sakshi
Sakshi News home page

ఖరగ్‌పూర్- విజయవాడ ఫ్రైట్ కారిడార్

Feb 25 2016 2:23 PM | Updated on Sep 3 2017 6:25 PM

ఖరగ్‌పూర్- విజయవాడ ఫ్రైట్ కారిడార్

ఖరగ్‌పూర్- విజయవాడ ఫ్రైట్ కారిడార్

ఈసారి బడ్జెట్‌లో మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు.

ఈసారి బడ్జెట్‌లో మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ఉత్తర, దక్షిణ భారతాలను కలుపుతూ ఢిల్లీ - చెన్నై మధ్య ఒకటి, తూర్పు-పడమరలను కలుపుతూ ఖరగ్‌పూర్ - ముంబై మధ్య ఒకటి, తూర్పు తీరం వెంబడి ఖరగ్‌పూర్ నుంచి విజయవాడకు ఒకటి ఈ కారిడార్లను ఆయన ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులుగా నిర్ణయించారు. వీటిని తగిన సమయంలోగా పూర్తి చేయాలని తెలిపారు.

పీపీపీ పద్ధతిలో వినూత్న ఫైనాన్సింగ్ పథకాల ద్వారా వీటికి నిధులు ఇస్తామని తెలిపారు. మార్చి 31 నాటికి ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా.. సివిల్ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అన్ని కాంట్రాక్టులను అప్పగిస్తామన్నారు. గత ఆరేళ్లలో మొత్తం రూ. 13 వేల కోట్ల కాంట్రాక్టులు అప్పగించగా, తాను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రూ. 24 వేల కోట్ల కాంట్రాక్టులు అప్పగించినట్లు సురేశ్ ప్రభు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement