విద్యార్థిని కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం | Student allegedly gangraped in Ganjam | Sakshi
Sakshi News home page

విద్యార్థిని కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం

Mar 8 2015 3:16 PM | Updated on Sep 2 2017 10:31 PM

విద్యార్థిని కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం

విద్యార్థిని కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం

తొమ్మిదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బరంపురం: తొమ్మిదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం...  ఒడిశా గంజాం జిల్లాలోని చాముండా గ్రామంలో గత నెల ఫిబ్రవరి 18వ తేదీన తొమ్మిదో తరగతి విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి... కారులో తరలిస్తూ ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బాలికను బెదిరించి వారు పరారైయ్యారు.

దాంతో సదరు బాలిక జరిగిన విషయాన్ని చాలా ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని గుర్తించామని పోలీసులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను ఆరెస్ట్ చేస్తామని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement