breaking news
class IX student
-
ఈ అమ్మాయి మాటలకు.. సీఎం కంటతడి
అహ్మదాబాద్: ఆడశిశువుల భ్రూణహత్యలపై తొమ్మిదో తరగతి విద్యార్థిని అంబికా గోహెల్ చేసిన భావోద్వేగ ప్రసంగం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ సహా సభికులందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఖేడా జిల్లా మహుదా తాలూకాలోని హెరంజీ గ్రామానికి చెందిన అంబిక ప్రసంగం అందరినీ ఆలోచింపచేసింది. భ్రూణహత్యకు గురైన ఓ ఆడశిశువు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసినట్టుగా ఊహాజనిత కల్పిత లేఖను అంబిక చదవి వినిపించింది. తల్లిగర్భంలో మరణించిన ఆడశిశువుకు కూడా ప్రపంచాన్ని చూడాలని ఉంటుందని, గాలిని పీల్చాలని ఉంటుందని, అయితే ఈ అవకాశాన్ని ఇవ్వడం లేదంటూ మృత శిశువు ఆవేదన చెందుతున్నట్టుగా అంబిక ప్రసంగించింది. 'నేను ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే నన్ను చంపేశారు. అమ్మా ఓ విషయం గుర్తించుకో. కూతురు లేకుంటే ఇల్లు ఇల్లే కాదు' అని మృతశిశువు బాధను అంబిక తన మాటల్లో చెప్పింది. అంబిక మాట్లాడుతుండగా.. భావోద్వేగానికి గురైన అమ్మాయిలు సభలో ఏడ్చేశారు. అంబిక ప్రసంగం పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్.. ఆ అమ్మాయిని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. తనకు డాక్టర్ కావాలని ఉందని అంబిక సీఎంతో చెప్పారు. -
విద్యార్థిని కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం
బరంపురం: తొమ్మిదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఒడిశా గంజాం జిల్లాలోని చాముండా గ్రామంలో గత నెల ఫిబ్రవరి 18వ తేదీన తొమ్మిదో తరగతి విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి... కారులో తరలిస్తూ ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బాలికను బెదిరించి వారు పరారైయ్యారు. దాంతో సదరు బాలిక జరిగిన విషయాన్ని చాలా ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని గుర్తించామని పోలీసులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను ఆరెస్ట్ చేస్తామని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.