అన్నా హజారేకు సోనియా లేఖ | Sonia Gandhi letter to Anna Hazare | Sakshi
Sakshi News home page

అన్నా హజారేకు సోనియా లేఖ

Mar 19 2015 3:06 AM | Updated on Oct 22 2018 9:16 PM

అన్నా హజారే - సోనియా గాంధీ - Sakshi

అన్నా హజారే - సోనియా గాంధీ

భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు.

 న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే చేపట్టనున్న పాదయాత్రకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆమె అన్నాకు ఓ లేఖ రాశారు.  భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 14 పార్టీలు సోనియా నేతత్వంలో మంగళవారం రాష్ట్రపతి భవన్‌కు   చేపట్టిన ర్యాలీపై అన్నా తనకు రాసిన లేఖకు ఆమె సమాధానంగా ఈ లేఖ రాశారు.

'భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై మీరు సందేహాలు వ్యక్తం చేస్తూ మార్చి 14న మీరు రాసిన లేఖ అందింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సు, సవరణ బిల్లుపై మీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇది పూర్తిగా రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అన్ని వేదికలపైనా కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ చేపట్టడం కూడా బిల్లుపై మా వ్యతిరేకతను వ్యక్తం చేయటంలో భాగమే. దీనికి సంబంధించి మా పోరాటం కొనసాగుతుందని మీకు హామీ ఇస్తున్నా'అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement