జమ్మూకశ్మీర్లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక జవాను కనిపించకుండా పోయాడు.
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక జవాను కనిపించకుండా పోయాడు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఒక జవానును మాత్రం రక్షించగలిగారు.
కానీ, రెండో సైనికుడి జాడ మాత్రం తెలియడం లేదు. రెండు రోజుల కిందట కార్గిల్ సెక్టార్ లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.