ఏటీఎంలోకి నాలుగడుగుల కోబ్రా 

Snake Found Inside Tamil Nadu ATM - Sakshi

సాక్షి, కోయంబత్తూరు : కేరళలో వీవీ ప్యాట్‌లో పాము ప్రత్యక్షం అయిన ఘటన మరవకముందే ....తాజాగా ఏటీఎం మిషన్‌లోకి పాము దూరిన సంఘటన కలకలం రేపింది. తమిళనాడు కోయంబత్తూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. థనీర్‌ర్‌పండల్‌ రోడ్‌లోని ఏడీబీఐ బ్యాంక్‌ ఏటీఎం మిషన్‌ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఓ కస‍్టమర్‌...పాము ఉండటాన్ని గమనించి...వెంటన అలారాన్ని మోగించాడు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్‌ దృష్టికి తీసుకు వెళ్లగా...పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. హుక్‌ హ్యాండిల్‌కు చుట్టుకున్న నాలుగు అడుగుల కోబ్రాను ఎట్టకేలకు పాములు పట్టే వ్యక్తి పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా మూడో దశ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కేరళలోని కన్నౌర్‌ నియోజకవర్గంలోని మయ్యిల్ కందక్కైలో పోలింగ్ బూత్‌లోని ఓ వీవీ ప్యాట్‌లో పాము దర్శనమివ్వడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. చివరకు పామును బయటకు రప్పించిన అధికారులు ...పోలింగ్‌ను కొనసాగించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top