
సాక్షి, కర్ణాటక: నిలిపి ఉంచిన బైక్‌లో దూరిన నాగుపామును స్నేక్ ప్రసన్న సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలిన సంఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన సోమశేఖర్ శనివారం ఆలయానికి స్కూటర్‌లో వచ్చాడు. వాహనం నిలిపి ఆలయంలోకి వెళ్లిన సమయంలో నాగుపాము సీటు కింది భాగంలో చేరింది. దీనిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి సోమశేఖర్ బయటకు రాగానే చెప్పడంతో అతను స్నేక్ ప్రసన్నకు సమాచారం ఇవ్వడంతో అతను అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా బయటకు తీసి అడవిలో వదిలిపెట్టాడు.