మళ్లీ విదేశాలకు రాహుల్‌ | Slammed For Recent Italy Visit, unfazed Rahul Gandhi Set For Another Foreign Trip | Sakshi
Sakshi News home page

మళ్లీ విదేశాలకు రాహుల్‌

Mar 6 2018 11:00 AM | Updated on Mar 6 2018 12:25 PM

Slammed For Recent Italy Visit, unfazed Rahul Gandhi Set For Another Foreign Trip - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో రాహుల్‌ ఇటలీ పర్యటనలో ఉండటంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే వీటిని పట్టించుకోని రాహుల్‌ మళ్లీ విదేశాల బాట పట్టనున్నారు. మార్చి 8 నుంచి మూడురోజుల పాటు రాహుల్‌ సింగపూర్‌, మలేషియాలను చుట్టిరానున్నారు. ఈ నెల 8-9 తేదీల్లో సింగపూర్‌లో భారత సంతతిని ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగిస్తారు. భారత ప్రొఫెషనల్స్‌, సింగపూర్‌ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.

ఇక మలేషియాలో భారత సంతతితో పాటు అక్కడ పెద్దసంఖ్యలో ఉన్న భారతీయ ఉద్యోగులు, వ్యాపారులతో సమావేశాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో భాగంగా ఎన్‌ఆర్‌ఐలతో భేటీ అవుతుంటారు. అదే పద్ధతిని ప్రస్తుతం కాంగ్రెస్‌ చీఫ్‌ అనుసరిస్తున్నారు. గతంలోనూ రాహుల్‌ పలు విదేశీ పర్యటనల సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమయ్యారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.అయితే విదేశాల్లో ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ రాహుల్‌ విమర్శల దాడి చేస్తున్నారని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement