ఈవ్‌టీజింగ్‌ కేసులో యువకుల అరెస్టు | Six youths arrested by anti-Romeo squad | Sakshi
Sakshi News home page

ఈవ్‌టీజింగ్‌ కేసులో యువకుల అరెస్టు

Mar 24 2017 12:07 PM | Updated on Jul 11 2019 8:06 PM

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముజఫర్‌నగర్‌: అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రవేశ పెట్టిన ఆంటీ రోమియో స్క్వాడ్‌ ఆకతాయిల పట్ల ఉక్కుపాదం మోపుతుంది. ముజఫర్‌ నగరలోని తానా భావన్‌ పట్టణంలో ఆరుగురి ఆకతాయిలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
 
ఉత్తరప్రదేశ్‌లో మహిళపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, శాంతి నెలకొల్పాలని పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్నట్లు సీఎం ఆదిత్యానాద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్కెట్లు, మాల్స్‌, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్ల వద్ద పోలీసులు మఫ్టిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈవ్‌టీజింగ్‌ రూపుమాపడమే రోమియో స్క్వాడ్‌ లక్ష్యమని పోలీసులు ప్రకటించారు.  

Advertisement
 
Advertisement
Advertisement