ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీల్లో భాగంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఈ తనిఖీల్లో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక స్మగ్లర్ల నుంచి నాలుగు వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేసినట్టు వెల్లడించారు.