breaking news
vehicle seized
-
కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. ఎంపీ స్టిక్కర్ వాహనం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో ఆదివారం జరిగిన రేవ్ పార్టీ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, రేవ్ పార్టీ నిర్వహించిన అశోక్ నాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రేవ్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా అశోక్ ఉన్నారు.వివరాల ప్రకారం.. ఆదివారం కొండాపూర్ SV సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయి, డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివంనాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి, యువకులతో ఎంజాయ్ చేయిస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్ బీ టీమ్ పట్టుకుంది. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్టు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు కార్లు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.అయితే, వీకెండ్ సందర్భంగా రేవ్ పార్టీని నిర్వహించింది అశోక్ నాయుడు అని పోలీసులు తేల్చారు. రేవ్ పార్టీ సందర్భంగా రెండు కార్లను సీజ్ చేసిన పోలీసులు.. అందులో ఒక ఫార్చ్యూనర్ కారుకు లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ కారులో ఎవరు వచ్చారు?. ఆ ఎంపీ పేరేంటి?. ఆయనే వచ్చారా లేక ఆ కారులో ఆయన బంధువులెవరైనా వచ్చారా? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అశోక్ నాయుడికి రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఆంధ్రజ్యోతి వాహనం సీజ్
సాక్షి, కర్నూలు: ఆంధ్రజ్యోతి దిన పత్రిక రవాణా వాహనంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా బొమ్మలసత్రం రూరల్ పోలీసులు సోమవారం స్వాదీనం చేసుకున్నారు. సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కర్నూలుకు చెందిన వీరబ్రహ్మేంద్ర ఆచారి కొంతకాలంగా తుపాన్ వాహనంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక కాపీలను రవాణా చేస్తున్నాడు. ఇదే క్రమంలో కర్నూలుకు చెందిన గుట్కా వ్యాపారి సుబ్బయ్యతో పరిచయం ఏర్పడటంతో అదే వాహనంలో గుట్కాపాకెట్లను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. సోమవారం తెల్లవారుజామున పత్రికల మధ్య రెండు గుట్కా ప్యాకెట్ల బస్తాలను దాచుకుని నంద్యాలకు బయలుదేరాడు. డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ దివాకర్‌రెడ్డి సిబ్బందితో స్థానిక ఆటోనగర్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండటాన్ని గమనించిన వీరబ్రహ్మేంద్రఆచారి పోలూరు గ్రామం వైపు వాహనాన్ని మల్లించాడు. ఎస్ఐ తిమ్మారెడ్డి వాహనం వెంటపడటంతో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి చివరకు విఫలమయ్యాడు. నిందితున్ని విచారించగా పట్టణానికి చెందిన నాగేంద్రబాబుకు గుట్కాపాకెట్లు సరఫరా చేస్తున్నట్లు అంగీకరించాడు. వాహనంతో పాటు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. చదవండి: గ్రామ వాలంటీర్ గొప్పతనం ఆదోనిలో.. ఆదోని: కర్ణాటకలోని శిరుగుప్ప తాలూకా బండ్రాళు గ్రామానికి చెందిన మహాదేవన్ అనే గుట్కా వ్యాపారిని ఆదోని వన్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.21,000 విలువైన నిషేధిత గుట్కా పాకెట్లు, రూ.11,000 నగదు, బైక్ స్వా«దీనం చేసుకున్నారు. కొంత కాలంగా మహాదేవన్ పట్టణంలోని వ్యాపారులకు నిషేధిత గుట్కాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో శిరుగుప్ప క్రాస్ రోడ్డు వద్ద నిఘా ఉంచి నిందితుడిని పట్టుకున్నామని వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. -
ఆవులను పట్టుకున్న పోలీసులు
తాండూరు రూరల్ వికారాబాద్ : ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆవులను కరన్‌కోట్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్ ఎదుట నుంచి వెళ్తున్న ఆవులను తోలుకెళ్తున్న వ్యక్తులను ఆపి వివరాలు అడిగారు. ఆవుల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు ఆవులను తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, బజరంగ్దళ్, బీజేపీ, ఏబీవీపీ నాయకులు కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆవులను ఎక్కడికి తరలిస్తున్నారని వ్యక్తులను ప్రశ్నించారు. యాలాల మండలం జుంటుపల్లి అనుబంధ గ్రామం రేళ్లగడ్డతండా నుంచి 33 ఆవులను తాండూరు మండలం రాంపూర్‌తండాకు తీసుకెళ్తున్నమని వారు చెప్పారు. సరైన సమాధానం చెప్పాలని కోరగా తాండూరుకు చెందిన సాధిక్ ఈ ఆవులను రూ.1.60 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్ఐ రేణుకారెడ్డితో నాయకులు భేటీ అయ్యారు. బక్రీద్ సందర్భంగా ఆవులను విక్రయించడానికి తీసుకెళ్తున్నారని వారు ఆరోపించారు. తాండూరు చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఎస్ఐ స్పందిస్తూ ఆవులకు సంబంధించిన పూర్తి విచారణ చేపడతామన్నారు. అప్పటి వరకు ఆవులను పట్టణంలోని గోశాలకు తరలిస్తామని చెప్పారు. ఆవులను తీసుకెళ్తున్న వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రమ్యానాయక్, బొప్పి సురేష్, టైలర్ రమేష్, రజనీ, అశోక్, నాగేష్, దాస్, మహేష్ పాల్గొన్నారు. -
బంజారాహిల్స్‌లో కార్డన్‌సెర్చ్
బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్, హుమాయూన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు ప్రతీ ఇంటినీ, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: పాతబస్తీలో గురువారం ఉదయం నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో భారీగా జరుగుతున్న అక్రమాలను గుర్తించారు. రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, మొగల్పురా, చంద్రాయణ్‌గుట్ట పోలీస్స్టేషన్ల పరిధిలో సౌత్‌జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. ఇంటింటి తనిఖీల్లో భాగంగా నేర చరిత్ర ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గాజుల తయారీ పరిశ్రమలు ఐదింటిపై దాడులు చేసి 30 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. మామిడి పండ్ల గోదాములు తనిఖీ చేసి, రసాయనాలతో మామిడి పండ్లను మగ్గబెడుతున్నట్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. జంతువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి నిర్వాహకుడిని పట్టుకున్నారు. అలాగే, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. -
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
బెంగళూరు: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీల్లో భాగంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక స్మగ్లర్ల నుంచి నాలుగు వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేసినట్టు వెల్లడించారు.