కలకలం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి | Six dead in New empty flat in Ahmedabad | Sakshi
Sakshi News home page

కలకలం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

Jun 19 2020 1:48 PM | Updated on Jun 19 2020 2:04 PM

Six dead in New empty flat in Ahmedabad - Sakshi

అహ్మదాబాద్‌ : అవుటింగ్‌కి వెళ్తున్నామని చెప్పి బయటికి వెళ్లి, ఆరుగురు మృతిచెందిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కలకలం సృష్టిస్తోంది. అహ్మదాబాద్‌లో ఒ​కే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. వీరిలో నలుగురు 9 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. జూన్‌ 17న అ‍మ్రీష్‌ పటేల్‌(42), గౌరాంగ్‌ పటేల్‌(40)లు అవుటింగ్‌కని వారి భార్యలతో చెప్పి నలుగురు పిల్లలతో కలిసి బయటకు వెళ్లారు. (తండ్రి కోరిక మేరకు దిష్టిబొమ్మతో పెళ్లి)

అయితే గురువారం వరకు ఇంటికి రాకపోవడంతో అ‍మ్రీష్‌ పటేల్‌, గౌరాంగ్‌ పటేల్‌ల భార్యలు తమకు చెందిన ఖాళీ ఫ్లాట్‌కి వెళ్లి చూడగా లోపలి నుంచి లాక్‌ వేసి ఉంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అహ్మదాబాద్‌లోని వటవా జీఐడీసీ అపార్ట్‌మెంట్‌లో వారి సొంత ఖాళీ ఫ్లాట్‌లోపలికి వెళ్లి చూడగా శుక్రవారం ఉదయం ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. డ్రాయింగ్‌ రూమ్‌లో అ‍మ్రీష్‌ పటేల్‌, గౌరాంగ్‌ పటేల్‌లు, కిచెన్‌లో ఇద్దరు బాలికలు, క్రితీ(9), శాన్వీ(12), బెడ్‌రూమ్‌లో మయూర్‌(9), ధృవ్‌(9)ల మృతదేహాలు కనిపించాయి. వీరందరూ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు. అ‍మ్రీష్‌ పటేల్‌, గౌరాంగ్‌ పటేల్‌లు ముందుగా పిల్లలకు ఆహారంలో విషయం కలిపి తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.(పబ్లిక్‌గా మూత్రం పోయోద్దన్నందుకు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement