యూపీలో ఘోర రైలు ప్రమాదం | Six coaches of Utkal Express derail in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రైలు ప్రమాదం

Aug 19 2017 8:23 PM | Updated on Sep 17 2017 5:42 PM

యూపీలో ఘోర రైలు ప్రమాదం

యూపీలో ఘోర రైలు ప్రమాదం

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 23 మంది మరణించారు.

సాక్షి, లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 23 మంది  మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై  రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి మెడికల్‌ వ్యాన్స్‌, వైద్య సిబ్బంది చేరుకున్నాయని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement