
కాన్పూర్ : గంగా నదిలో ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం కాన్పూర్‌లోని గంగా నదిలో స్నానానికి వెళ్లిన చిన్నారులు, నీటిలో మునిగిపోయారు. వారంత కూడా 10 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల వారని తెలుస్తోంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు, ఈతగాళ్లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. ఆరుగురు చిన్నారులు నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశాం. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాలను కాన్పూర్‌లోని హాలెత్ హాస్పిటల్‌కు తరలించామన్నారు.