త్యాగాలకు మా బిడ్డలంతా సిద్ధం | Sihora villagers ready to join Army after Ashwin kumar kachi | Sakshi
Sakshi News home page

త్యాగాలకు మా బిడ్డలంతా సిద్ధం

Feb 16 2019 3:13 PM | Updated on Feb 16 2019 3:16 PM

Sihora villagers ready to join Army after Ashwin kumar kachi - Sakshi

భోపాల్‌: దేశం కోసం తమ బిడ్డలందరినీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు మధ్యప్రదేశ్‌లోని కుదవాల్‌ సిహోరా గ్రామస్థులు. పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఈ గ్రామానికి చెందిన 36 ఏళ్ల అశ్విన్‌ కచ్చి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే దేశం కోసం తమ బిడ్డ ప్రాణాలర్పించినందుకు తామెంతో గర్వపడుతున్నామని.. మిగతా బిడ్డలను కూడా సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. 

అశ్విన్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘నా కొడుకు అశ్విన్‌ లాంటి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మా గ్రామానికి చెందిన దాదాపు 30 మంది ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరెంతోమంది యువకులు సైన్యంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు' అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement