'వద్దు.. మీ సాయం అవసరం లేదు' | Siachen avalanche: Army says no to Pakistani help in search for soldiers | Sakshi
Sakshi News home page

'వద్దు.. మీ సాయం అవసరం లేదు'

Feb 4 2016 8:38 PM | Updated on Sep 3 2017 4:57 PM

'వద్దు.. మీ సాయం అవసరం లేదు'

'వద్దు.. మీ సాయం అవసరం లేదు'

సియాచిన్లో గల్లంతైన భారత సైనికులను గుర్తించేందుకు తాము కూడా సహాయం చేస్తామని పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను భారత సైనిక లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ తిరస్కరించారు.

న్యూఢిల్లీ: సియాచిన్లో గల్లంతైన భారత సైనికులను గుర్తించేందుకు తాము కూడా సహాయం చేస్తామని పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను భారత సైనిక లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ తిరస్కరించారు. ఇప్పటికే తాము అవసరమైన చర్యలు తీసుకున్నామని, వారు గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు.

దాదాపు 19 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ గ్లేసియర్ వద్ద మంచుకొండచరియలు విరిగిపడి దానికింద దాదాపు 10 మంది సైనికులు ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. వారి కోసం నిన్నటి నుంచి గాలింపు చర్యలు జరుగుతునే ఉన్నాయి. కాగా, ప్రమాదం చోటుచేసుకున్న 30గంటల తర్వాత స్పందించిన పాక్.. భారత సైనికులను గుర్తించడంలో తాము సహాయం చేస్తామని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement