అందాలకు హద్దులు | Shruti Haasan explains on doing glamorous roles in Tamil | Sakshi
Sakshi News home page

అందాలకు హద్దులు

Oct 15 2014 11:59 PM | Updated on Sep 2 2017 2:54 PM

అందాలకు హద్దులు

అందాలకు హద్దులు

ఇకపై అందాలారబోతకు హద్దులుంటాయంటున్నారు శ్రుతి హాసన్. ఒక ప్రఖ్యాత నటుడు వారసురాలిగా రంగప్రవేశం చేసిన ఈ భామ తొలిరోజుల్లోనే హిందీ చిత్రం లక్‌లో శ్రుతి మించిన

 ఇకపై అందాలారబోతకు హద్దులుంటాయంటున్నారు శ్రుతి హాసన్. ఒక ప్రఖ్యాత నటుడు వారసురాలిగా రంగప్రవేశం చేసిన ఈ భామ తొలిరోజుల్లోనే హిందీ చిత్రం లక్‌లో శ్రుతి మించిన అందాలను తెరపై ఆరబోసి విమర్శలు మూటకట్టుకున్నారు. ఆ తరువాత కూడా హిందీ, తెలుగు భాషల్లో అందాలొలక బోస్తూ గ్లామర్‌డాల్‌గా ప్రాచుర్యం పొందారు. అయితే తమిళ చిత్రాల్లో గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆమె తమిళంలో 3, 7 ఆమ్ అరివు చిత్రాల్లో నటించారు. తాజాగా నటించిన పూజై చిత్రం దీపావళికి తెరపైకి రానుం ది.
 
 ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ తానెలా నటించాలన్న విషయమై సొంత నిర్ణయాలు ఏమి తీసుకోలేదన్నారు. ఆ విషయాన్ని పాత్రలే నిర్ణయిస్తాయన్నారు. ఇక గ్లామర్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుందన్నారు. అంతేగాని హిందీ, తెలుగు చిత్రాల్లో గ్లామరస్‌గా నటిస్తున్నానని, తమిళ చిత్రాల్లో అందాలారబోత విషయంలో అభిమానులను నిరాశపరుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఏదేమైనా ఇకపై ఇలాంటి విమర్శలకు దూరం అవడానికి ఏ భాషా చిత్రంలోనైనా గ్లామర్ విషయంలో కొన్ని పరిమితులు విధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. త్వరలో ఈ బ్యూటీ ఇళయదళపతి సరసన నటించడానికి సిద్ధం అవుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement