బంగ్లా ప్రధానితో కాంగ్రెస్‌ అధినేత్రి భేటీ

Sheikh Hasina Meets Sonia Gandhi In New Delhi - Sakshi

న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌హసీనాతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆమెతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, ఆనంద్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. వీరు ఈ సందర్భంగా అనేక విషయాలపై చర్చించారు. నాలుగు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన బంగ్లా ప్రధాని హసీనా శనివారం ఢిల్లీలో ప్రధానితో భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్, బంగ్లాదేశ్‌ అంగీకరించాయి. అనంతరం రెండు దేశాల అధికారులు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తీరం ప్రాంతంలో ఉమ్మడి గస్తీ సహా మూడు ప్రాజెక్టుల ప్రారంభానికి అంగీకరించారు. కాగా, చర్చల సందర్భంగా అస్సాం ఎన్‌ఆర్‌సీ అంశాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని ప్రస్తావించారు. నాలుగు రోజుల పర్యటనకు ఈ నెల 3వ తేదీన భారత్‌ చేరుకున్న ప్రధాని హసీనా 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top