యూఏపీఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

SC Notice To Centre On Anti Terror UAPA Law - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం (యూఏపీఏ) 2019ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రజలు తమ అసంతృప్తిని వెళ్లగక్కే హక్కును నిరోధించే యూఏపీఏను రాజ్యాంగవ్యతిరేకమని ప్రకటించాలని పిటిషనర్‌ కోరారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ పేర్కొన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును ఈ చట్టం నిరోధిస్తుందని, టెర్రరిస్టుగా ముద్రపడిన వ్యక్తి అరెస్ట్‌ కాకుండా తనను తాను సమర్ధించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించడం లేదని పిటిషనర్‌ సజల్‌ అవస్ధి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top