నాగ్‌పూర్‌లో శాటిలైట్ల తయారీ | Sakshi
Sakshi News home page

నాగ్‌పూర్‌లో శాటిలైట్ల తయారీ

Published Sun, Feb 21 2016 7:34 PM

Satellite Manufacturing Unit To Come Up In Nagpur

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో త్వరలోనే కృత్రిమ ఉపగ్రహాల తయారీ కేంద్రం రానుంది. ఇక్కడి మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్, కార్గో హబ్ (ఎంహెచ్‌ఏఎన్)లో దీన్ని నెలకొల్పనున్నారు. దాదాపు రూ.150 కోట్ల ఖర్చుతో కెనడాలోని ఎన్‌ఆర్‌ఐ మిలింద్ పింప్రికర్‌కు చెందిన కానియస్ అనే కంపెనీ ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీ, మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. మేకిన్ ఇండియా వీక్ సందర్భంగా నాగ్‌పూర్‌లో ఈ యూనిట్‌ను నెలకొల్పాలనుకోవడం సంతోషంగా ఉందని  గడ్కరీ పేర్కొన్నారు. ఈ కేంద్రం స్థాపనతో దాదాపు 500 మందికి ఉపాధి లభించనుంది.
 

Advertisement
Advertisement