గవర్నర్‌తో అమీతుమీకి శశికళ సై! | sasikala may ready to parade in front of rajbhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో అమీతుమీకి శశికళ సై!

Feb 12 2017 3:13 PM | Updated on Sep 5 2017 3:33 AM

గవర్నర్‌తో అమీతుమీకి శశికళ సై!

గవర్నర్‌తో అమీతుమీకి శశికళ సై!

తమిళనాడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం సీటుకోసం పట్టుబడుతున్న శశికళ మరో అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారు.

చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం సీటుకోసం పట్టుబడుతున్న శశికళ మరో అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారు. ఆమె ఏకంగా గవర్నర్‌ విద్యాసాగర్‌రావుపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని శశికళ కోరిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అనుకూలమైన వాతావరణం కోసం కాస్తంత వేచి చూసే ధోరణిలో గవర్నర్‌ ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ అనుసరిస్తున్న తీరుపట్ల విసిగివేసారిన శశికళ ఇక ఏకంగా ఆయనతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సాయంత్రంలోగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోకుంటే గవర్నర్‌ అధికారిక బంగళా రాజ్‌భవన్‌ ముందు ఎమ్మెల్యేలతో కలిసి పరేడ్‌ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆమె తన పక్కనే ఉన్న ఎమ్మెల్యేలతో ఇదే విషయాన్ని చర్చించడంతోపాటు ఆయా రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు కూడా గోల్డెన్‌ బే రిసార్ట్‌ వద్దకు బయలుదేరారు. తనకు మద్దతు కోరడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణ, రాజ్‌భవన్‌ముందు పరేడ్‌కు వెళదామనే అంశాన్ని వారికి చెప్పి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో ఈ విషయంపై స్పష్టత రానున్నట్లు శశి వర్గం చెబుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement