ఖడ్గమృగాన్ని చంపేశారు | Rhino killed in Kaziranga | Sakshi
Sakshi News home page

ఖడ్గమృగాన్ని చంపేశారు

Apr 10 2015 1:53 PM | Updated on Sep 3 2017 12:07 AM

ఖడ్గమృగాన్ని చంపేశారు

ఖడ్గమృగాన్ని చంపేశారు

అసోంలోని కజిరంగ పార్క్లో ఓ ఆడ ఖడ్గ మృగాన్ని ఎవరో దుండగులు చంపేశారు. దాని కొమ్ములు తొలగించి తీసుకొని పారిపోయారు.

కజిరంగ: అసోంలోని కజిరంగ పార్క్లో ఓ ఆడ ఖడ్గ మృగాన్ని ఎవరో దుండగులు చంపేశారు. దాని కొమ్ములు తొలగించి తీసుకొని పారిపోయారు. పార్క్ అధికారుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం బార్బోరిబిల్ ఫారెస్ట్ క్యాంప్లో తుపాకీ పేలుళ్ల చప్పుళ్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన పార్క్ రక్షణ అధికారులు ఏం జరిగి ఉంటుందా అని పెట్రోలింగ్ నిర్వహించగా చనిపోయి రక్తపు మడుగులో పడిఉన్న ఖడ్గమృగం కనిపించింది. అక్కడే వారు ఐదు ఖాళీ తూటాలను గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఏడాదిలో దొంగల కారణంగా ఖడ్గమృగాలు చనిపోవడం ఇది తొమ్మిదో ఘటన.    
 

Advertisement
 
Advertisement
Advertisement