రిటైర్డు జస్టిస్‌ కోదండ రామయ్య కన్నుమూత | Retired Justice Kodanda Ramayya passed away | Sakshi
Sakshi News home page

రిటైర్డు జస్టిస్‌ కోదండ రామయ్య కన్నుమూత

Jun 16 2018 3:24 AM | Updated on Jun 16 2018 3:24 AM

Retired Justice Kodanda Ramayya passed away - Sakshi

న్యూఢిల్లీ: రిటైర్డు జస్టిస్‌ పమిడిఘంటం కోదండ రామయ్య (92) శుక్రవారం ఢిల్లీలో కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనున్నాయి. 1926లో జన్మించిన కోదండ రామయ్య 1952లో మద్రాసు హైకోర్టులో అడ్వకేటుగా జీవితాన్ని ప్రారంభించారు. 1982లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1988 వరకు ఈ బాధ్యతల్లో ఉన్నారు. ‘అర్ష విజ్ఞాన ట్రస్ట్‌’ అనే పబ్లిషింగ్‌ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement