సాక్ష్యం చెబితే ఖబడ్దార్‌.. ట్విషా శర్మ భర్త గూండాగిరీ! | Twisha Sharma Case Witness Attacked Allegedly By Husband Friendscctv visuals | Sakshi
Sakshi News home page

సాక్ష్యం చెబితే ఖబడ్దార్‌.. ట్విషా శర్మ భర్త గూండాగిరీ!

Jun 2 2026 12:00 PM | Updated on Jun 2 2026 12:35 PM

Twisha Sharma Case Witness Attacked Allegedly By Husband Friendscctv visuals

నటి,మోడల్‌ ట్విషా శర్మ మృతి కేసులో మరో సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. వరకట్నం వేధింపులతోనే ఆమె ఆత్మహత్యకు  పాల్పడిందన్న ఆరోపణలు  రోజు రోజుకు మరింత బలపడుతున్నాయి.   ట్విషా అత్త, మాజీ  జడ్జ్‌  బాధితురాలిపై  చేసిన అనుచిత వ్యాఖ్యలు  ఇప్పటికే సంచలనం రేపగా,  తాజాగా సాక్షులను బెదరించి, భయపెట్టేందుకు ఆమె భర్త చేసిన ప్రయత్నాలు  కలకలం రేపాయి. కీలక సాక్షిపై ట్విషా భర్త ప్రధాన నిందితుడైన భర్త సమర్థ్ సింగ్ స్నేహితులు  గుండా గిరీ ప్రదర్శించారు. కట్నం వేధింపుల ఆరోపణలు, ఆమె ఉరివేసుకుందని చెబుతున్న బెల్ట్‌ మాయం కావడం లాంటి అంశాలపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమర్థ్ సింగ్ ఇంటి సమీపంలో సెలూన్ నడుపుతున్న నీరజ్ దూబే అనే వ్యక్తిపై మే 30న సింగ్ స్నేహితులు మూకుమ్మడిగా దాడి చేశారు. దాదాపు ఆరుగురు వ్యక్తులు తనను చుట్టుముట్టి కోర్టులో సాక్ష్యం చెప్పవద్దంటూఒత్తిడి తెచ్చారని, దుర్భాషలాడారని దూబే వాపోయారు. దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో, తనపై దాడి చేశారని దుబే ఆరోపించారు. ఈ దాడి, దూబే, రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సిసిటివి (CCTV) లో రికార్డయ్యాయి. 

ఈ విషయంలో తనకు రక్షణ కల్పించాలని,  తగిన న్యాయం చేయాలని కోరుతూ దూబే కటారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.  తన ప్రాణానికి ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆయనకు హామీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: ఐపీఎల్‌ ఫైనల్‌లోమెరిసిన అనుష్క, స్పెషల్‌ లగ్జరీ వాచ్‌, ధర ఎంతో?

కాగా ఏప్రిల్ 12న ట్విషా శర్మ తన అత్తవారి ఇంట్లో శవమై కనిపించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్‌లపై కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. సీబీఐ ఆధ్వర్యంలో తల్లి, కొడుకు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం పోలీసులు వారిని కటారా హిల్స్ నివాసానికి తీసుకెళ్లి, శర్మ మరణించిన రాత్రి ఏం జరిగిందనే దానిపై క్రైమ్ సీన్‌ను రీ-క్రియేట్ చేసి విచారించారు. మరోవైపు ట్విషాశర్మ కేసులో అసలు ఏం జరిగింది అనేది మిస్టరీగామారింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు పార్లర్‌కు వెళ్లిన  దాదాపు గంటసేపు గడిపింది. దీనిపైనా కూడా  అత్త గిరిబాల సింగ్‌  పార్లర్‌కు వెళ్లి  వారిని బెదిరించిందనీ, సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించాలని కూడా డిమాండ్‌ చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్‌ స్టారే!

Advertisement
 
Advertisement
Advertisement