‘కశ్మీర్‌.. అదుపులో ఉంది’ | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్‌.. అదుపులో ఉంది’

Published Sun, Nov 19 2017 4:57 PM

remarkable change in Kashmir - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని.. తిరుగుబాటు కార్యకలాపాలు నిలిచిపోయాయని ఆర్మీ ప్రకటించింది. కశ్మీర్‌లోని హాజిన్‌ సెక్టార్‌లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చిన అనంతరం లెఫ్టినెంట్‌ జనరల్‌ జేఎస్‌ సంధూ, జనరల్ ఆఫీసర్‌ కమాండింగ్‌ (జీఓసీ) అధికారులు మీడియాతో మాట్లాడారు. లోయలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని వారు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటిరకూ 125 మంది ఉగ్రవాదులను లోయలో ఏరేశామని వారు ప్రకటించారు. లోయలో శాంతి మళ్లీ పరిఢవిల్లుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. 2017 నుంచి ఇప్పటివరకూ మొత్తం 190 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఇందులో 80 మంది స్థానిక ఉగ్రవాదులు కాగా, 110 మంది విదేశీ ఉగ్రవాదులను వారు తెలిపారు.

ఉగ్రవాదుల ఏరివేతలో జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, నిఘా సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. పాకిస్తాన్‌ కోసం పని చేసే ఉగ్రవాదులు.. పారిపోతే బతికి పోతారని, అలాగే కశ్మీర్‌లోని దేశీయ ఉగ్రవాదులు పునారాలోచన చేసుకోవాలని వారు హెచ్చరించారు. రాబోయో రోజుల్లో భద్రతాబలగాలు మరింత సమర్థవంతంగా ఉగ్రవాదులపై మరింత ధాటిగా పోరాటానికి దిగుతాయని ఆరు స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement