భారీ ఉగ్ర కుట్ర భగ్నం | RDX Found Inside A Bus Near Jammu Bus Stand | Sakshi
Sakshi News home page

భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Oct 1 2019 2:23 PM | Updated on Oct 1 2019 2:24 PM

RDX Found Inside A Bus Near Jammu Bus Stand - Sakshi

భారీ ఉగ్రదాడి యత్నాలను భద్రతా దళాలు మంగళవారం భగ్నం చేశాయి.

శ్రీనగర్‌ : ఉగ్రవాదులు భారీ ఉగ్ర దాడికి రూపొందించిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము బస్టాండ్‌ సమీపంలో పార్క్‌ చేసిన బస్‌ నుంచి భద్రతా దళాలు మంగళవారం భారీ మొత్తంలో ఆర్డీఎక్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పెనుముప్పు తప్పింది.కథువా జిల్లా బిలావర్‌ నుంచి జమ్ముకు ఈ బస్సు చేరుకుందని అధికారులు తెలిపారు. బస్‌ డ్రైవర్‌, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్డీఎక్స్‌ లభ్యం కావడంపై ప్రశ్నిస్తున్నారు. ఆర్డీఎక్స్‌తో కూడని ప్యాకెట్‌ను బిలావర్‌లో తమకు ఓ జంట అప్పగించిందని బస్‌ డ్రైవర్‌ భద్రతా దళాలకు చెప్పినట్టు తెలిసింది. కాగా ఇటీవల బిలావల్‌లోని దేవల్‌ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి 40 కిలోల గన్‌ పౌడర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement