రాజీవ్‌పై బాదల్‌ సంచలన ఆరోపణలు | Rajiv Gandhi was supervising killings during 1984 anti-Sikh riots | Sakshi
Sakshi News home page

రాజీవ్‌పై బాదల్‌ సంచలన ఆరోపణలు

Jan 29 2018 6:14 PM | Updated on Jan 29 2018 6:14 PM

Rajiv Gandhi was supervising killings during 1984 anti-Sikh riots - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సిక్కు వ్యతిరేక అల్లర్లను అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ స్వయంగా పర్యవేక్షించారని పంజాబ్‌ మాజీ సీఎం, అకాలీదళ్‌ నేత సుక్బీర్‌ సింగ్‌ బాదల్‌ ఆరోపించారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను పరిశీలించేందుకు రాజీవ్‌ తనతో ఢిల్లీ అంతటా కలియతిరిగారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత జగదీష్‌ టైట్లర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా బాదల్‌ ప్రస్తావించారు. జగదీష్‌ టైట్లర్‌ వ్యాఖ్యల ప్రకారం రాజీవ్‌గాంధీ సిక్కుల హత్యాకాండను దగ్గరుండి పర్యవేక్షించారని స్పష్టమవుతోందని బాదల్‌ ఆరోపించారు.

టైట్లర్‌ వెల్లడించిన విషయాలను సీబీఐ సీరియస్‌గా పరిశీలించాలని కోరారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లపై సుప్రీం కోర్టు ఇటీవల నూతన సిట్‌ను ఏర్పాటు చేసి కేసుల పునర్విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. 1984 అక్టోబర్‌ 31న ఇంధిరాగాంధీని ఆమె బాడీగార్డులు కాల్చిచంపిన అనంతరం ఢిల్లీ, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో చెలరేగిన అల్లర్లలో 3325 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 2,733 మంది మరణించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement