కుటుంబమే ముఖ్యం: రజనీ | Rajinikanth’s political entry: Superstar gives fans further hope | Sakshi
Sakshi News home page

కుటుంబమే ముఖ్యం: రజనీ

Dec 28 2017 3:09 AM | Updated on Sep 12 2019 10:40 AM

Rajinikanth’s political entry: Superstar gives fans further hope - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎవరికైనా చేస్తున్న వృత్తి, రాజకీయాల కన్నా తల్లిదం డ్రులు, కుటుంబమే ముఖ్యమని సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. తన రాజకీయ ప్రవేశంపై మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని సూచించారు. అభిమానులతో వరసగా రెండో రోజు సమావేశమవడానికి బయల్దేరే ముందు బుధవారం రజనీకాంత్‌ మీడియాతో మాట్లాడారు.

రాజకీయాల్లోకి వస్తున్నారా? తమిళనాడు కోసం ఏమైనా ప్రత్యేక పథకాలు సిద్ధం చేశారా? అని విలేకరులు ప్రశ్నించగా  ‘4 రోజులు ఓపిక పట్టండి, 31వ తేదీన అన్నీ చెబుతాను’ అని సమాధానమిచ్చి వెళ్లిపోయారు. నాలుగు జిల్లాల అభిమానులతో జరిగిన సమావేశంలో... రాజకీయాల్లోకి రావాలని ఒకరు కోరగా, రజనీ మాట్లాడుతూ మనకు అన్నిటి కన్నా తల్లిదండ్రులు, కుటుంబమే ముఖ్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement