ఇంటి ముందూ రైలు కూత.. | Railway line very close to homes | Sakshi
Sakshi News home page

ఇంటి ముందూ రైలు కూత..

Feb 27 2015 1:27 AM | Updated on Sep 2 2017 9:58 PM

ఇంటి ముందు నుంచే కూ.. చుక్.. చుక్ అంటూ కూత పెడుతూ రైలు వెళితే ఎలా ఉంటుంది..

న్యూఢిల్లీ : ఇంటి ముందు నుంచే కూ.. చుక్.. చుక్ అంటూ కూత పెడుతూ రైలు వెళితే ఎలా ఉంటుంది.. భలే కదా! ఇదే కాదు మరెన్నో విశేషాలతో అలరిస్తోంది పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. ఇప్పటి కొత్తతరం డీజిల్ ఇంజిన్లతో పాటు బ్రిటిష్ కాలంనాటి నాలుగు బీ క్లాస్ ఆవిరి ఇంజిన్లతో కేవలం 78 కిలోమీటర్ల పొడవున్న ట్రాక్‌పై ఈ రైళ్లు అటూ ఇటూ తిరుగుతుంటాయి.

అంతేకాదు 100 మీటర్ల నుంచి 2,200 మీటర్ల ఎత్తు పల్లాలతో.. దేశంలోనే ఎత్తయిన రైల్వే స్టేషన్‌కు తీసుకెళతాయి. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ‘టాయ్’ రైలును కూడా నడుపుతున్నారు. రెండు అడుగుల వెడల్పున పట్టాలుండే ఈ నేరోగేజ్ రైలు మార్గాన్ని 1879లో నిర్మించారు.. అన్నట్టూ దీనికి ప్రపంచ వారసత్వ హోదా కూడా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement