రైల్వే ఛార్జీలు పెంచట్లేదంటూనే రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ...దొడ్డిదారిన మోత మోగించారు. సరకు రవాణా ఛార్జీల్లో కాసింత సవరణలు ఉంటాయని ఆయన చెప్పటం విశేషం.
న్యూఢిల్లీ : రైల్వే ఛార్జీలు పెంచట్లేదంటూనే రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ...దొడ్డిదారిన మోత మోగించారు. సరకు రవాణా ఛార్జీల్లో కాసింత సవరణలు ఉంటాయని ఆయన చెప్పటం విశేషం. దాంతో రద్దీ ఉన్న మార్గాల్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సిమెంట్, బొగ్గు, ఉక్కు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. బొగ్గు రవాణా ఛార్జీ 6.3 శాతం, సిమెంట్ 2.7 శాతం, యూరియ 10 శాతం, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా ఛార్జీలు 1 శాతం మేర పెరిగే ఛాన్స్ ఉంది.