'రాహుల్కు త్వరలో బాధ్యతలు.. ఇంకేం చెప్పను' | Rahul to become Congress president soon: Ambika Soni | Sakshi
Sakshi News home page

'రాహుల్కు త్వరలోనే బాధ్యతలు.. ఇంకేం చెప్పను'

Oct 25 2016 7:19 PM | Updated on Mar 18 2019 9:02 PM

'రాహుల్కు త్వరలో బాధ్యతలు.. ఇంకేం చెప్పను' - Sakshi

'రాహుల్కు త్వరలో బాధ్యతలు.. ఇంకేం చెప్పను'

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలను అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్నట్లు స్పష్టమైంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలను అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్నట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీ స్పష్టం చేశారు. అయితే, అంతకుమించి వివరాలు తెలియజేసేందుకు మాత్రం ఆమె నిరాకరించారు.

'త్వరలోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మారనున్నారనే విషయం మాకు తెలుసు. ఇంతకుమించిన వివరాలేవి మీకు నేను అందించలేను' అని అంబికాసోనీ మంగళవారం మీడియాతో చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వచ్చే ఏడాది పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement