సార్‌ మా ఇంటి దగ్గర ఎలియన్ ఉంది!

Pune Man Writes To PMO  That He Saw Alien Object Outside His Home - Sakshi

పూణె : ఎలియన్స్‌ భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి పంపుతున్నాయి. దానిలో భాగంగా అవి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటో కనుక్కోండి సార్‌ అంటూ ప్రధాని కార్యాలయానికి ఈ మెయిల్‌ చేసాడో వ్యక్తి. ఈ విషయం గురించి విచారణ చేసిన పోలీసులు సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు.

ఆసక్తి రేపిన ఈ సంఘటన వివరాలు.. కొథ్రూడ్‌ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా బ్రెయిన్‌ హ్యామరేజ్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతను మానసిక పరిస్థితి క్షీణించింది. కొన్ని రోజుల క్రితం తన ఇంటి బయట మూడు లైట్లు వెలుగుతుండటం చూశాడు. దాంతో అవి ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువులగా భావించాడు. ఈ విషయం గురించి విచారణ చేయాల్సిందిగా ప్రధాని ఆఫీస్‌కు ఈ- మెయిల్‌ చేశాడు.

‘ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువు ఒకటి నా ఇంటి సమీపంలో తిరగుతుంది. అది భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి చేరవేస్తుంది. దీని వల్ల మనకు అపాయం కల్గుతుంది. కాబట్టి వెంటనే ఈ విషయం గురించి విచారణ చేపట్టండి’ అంటూ ప్రధాని ఆఫీస్‌కు ఈ మెయిల్‌ చేశాడు. పీఎంఓ అధికారులు దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తి మానసిర స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. అతను ఇలా మెయిల్‌ చేసిన విషయం ఇంట్లో కుటుంబ సభ్యులేవరికి తెలియదన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top