రియల్‌ హీరో అనిపించుకుంటున్న ఆటో డ్రైవర్‌

Pune Auto Driver Uses Money Saved For Wedding To Feed Migrants - Sakshi

ముంబై: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దాంతో పెళ్లిల్లు, ఇతర ప్రైవేట్‌ ఫంక్షన్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో పెళ్లి కోసం దాచిన డబ్బును పేదలకు వినియోగిస్తూ.. తన గొప్ప మనసు చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్‌. ఆ వివరాలు.. పుణెకు చెందిన అక్షయ్‌ కొథవాలె అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల కింద అక్షయ్‌కు వివాహం నిశ్చయమయ్యింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ నెల 25న అక్షయ్‌ వివాహం జరిగేది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వారి వివాహం వాయిదా పడింది.(లాక్‌డౌన్‌: అయ్యో పాపం..

ఈ నేపథ్యంలో పెళ్లి కోసం దాచిన 2 లక్షల రూపాయలను ఆకలితో ఉన్న పేదల కోసం వినియోగించాలనుకున్నాడు అక్షయ్‌. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి ప్రతి రోజు 400 మంది పేదలు, వలస కూలీలకు ఓ పూట ఆహారం అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు అక్షయ్‌. ధనవంతుల సంగతి పక్కకు పెడితే.. ఓ ఆటో డ్రైవర్‌కు 2 లక్షల రూపాయలు అంటే భారీ మొత్తమే. అంత సొమ్మును పేదలు కోసం వినియోగిస్తున్న అక్షయ్‌ రియల్‌ హీరో అని చెప్పవచ్చు. అయితే ఇలా సాయం చేయడం అక్షయ్‌కు కొత్త కాదు. గతంలో ముసలి వారిని, గర్భిణిలను తన ఆటోలో ఉచితంగా తీసుకెళ్లేవారు అక్షయ్‌. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top