కరుణానిధికి రాష్ట్రపతి పరామర్శ

President Ram Nath Kovind visits Karunanidhi in hospital - Sakshi

సాక్షి, చెన్నై: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరామర్శించారు. హైదరాబాద్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం చెన్నై వచ్చిన ఆయన, తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌తో కలిసి నేరుగా ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. కరుణానిధిని పరామర్శించిన అనంతరం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళిలతో రాష్ట్రపతి కాసేపు మాట్లాడారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కోవింద్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

జూలై 28 నుంచి కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు నేతలు ఆయనను పరామర్శించడం తెలిసిందే. కాగా కరుణానిధికి ఆరోగ్యం బాగాలేదనే బాధతో పుదుకోట్టై జిల్లా కరంబకుడికి చెందిన మూడో వార్డు డీఎంకే కార్యదర్శి మనోహరన్‌ ఆదివారం గుండె ఆగి              మరణించినట్లు సమాచారం. కరుణానిధి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మనోహరన్‌ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top