ల్యాండ్‌ డేటాబేస్‌లు సిద్ధం చేయండి: కేంద్రం | Prepare land databases | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ డేటాబేస్‌లు సిద్ధం చేయండి: కేంద్రం

Nov 30 2017 2:25 AM | Updated on Nov 30 2017 2:25 AM

Prepare land databases - Sakshi

న్యూఢిల్లీ: తక్కువ ధరల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడానికి వీలుగా సమగ్ర భూవివరాలతో ల్యాండ్‌ డేటాబేస్‌లను సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకం సమర్థంగా అమలు చేయడానికి మురికివాడల అభివృద్ధి ప్రణాళికల్ని తమతో పంచుకోవాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

ల్యాండ్‌ డాక్యుమెంట్లతో పాటు లేఅవుట్‌ అప్రూవల్, నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానాన్ని అనుసరించాలని సూచించింది. రుణ అనుసంధానిత సబ్సిడీ పథకాలను పోత్సహించడంతో పాటు పర్యవేక్షించాలనీ.. టీచర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు తదితర వర్గాల గృహనిర్మాణ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement